Mamita Baiju : ఆ హీరోయిన్ అంటే తెగ మోజు పడిపోతున్న రామ్ చరణ్

- Advertisement -

Mamita Baiju : మమిత బైజు.. ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు.. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ కుర్రాళ్ల హాస్టళ్లలో చూసిన సరే మమిత బైజు ఫొటోలే కనిపిస్తున్నాయి. అంతలా తన అందం చలాకీతనంతో కుర్రాళ్లను కట్టేసింది ఈ చిన్నది. ప్రేమలు సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా దక్షిణాదిలో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాలో రీనూ పాత్రలో మమితా బైజు అద్భుతంగా నటించింది. ప్రేమలు సినిమా తర్వాత మమితాకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ లభించింది.

ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా మూడు బడా సినిమాలను అందుకోవడం విశేషం. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమాలో నటిస్తుంది. న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు దేవర పార్ట్ 2 లో కూడా మమిత బైజు కనిపించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. కాగా ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మమితాను సెలక్ట్ చేసుకున్నారట మేకర్స్.

- Advertisement -

నిజానికి ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల చేత ఆమెను చేయలేనని చెప్పడంతో రామ్ చరణే స్వయంగా మమిత బైజు పేరుని సూచించాడట. దీంతో అంత పెద్ద గ్లోబల్ స్టార్ మమిత బైజు నటనకు ఫిదా అవ్వడంతో అందరూ షాక్ అయిపోతున్నారు . అయితే కొంతమంది ఈ ఆఫర్ రావడం పట్ల రాజమౌళి హస్తం ఉందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. మొత్తానికి గ్లోబల్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ మలయాళీ కుట్టి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here