Poonam Pandey : బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు పెద్ద సంచలనంగా మారుతాయనడంలో అతిశయోక్తి లేదు. కొద్ది రోజుల క్రితం ఆమె తన సర్వైకల్ క్యాన్సర్తో మరణించినట్లు ఓ పోస్టు పెట్టడంతో సోషల్ మీడియాలో పెను సంచలనమే నమోదైంది. ఆమె ఫ్యాన్స్ అందరూ తెగ టెన్షన్ పడ్డారు. అంతకు ముందు ఆమె ప్రైవేట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పటి నుండి పూనమ్ లైమ్లైట్లో ఉంది. ఆమెకు సంబంధించిన ఆ వీడియో అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. పూనమ్ బాత్రూమ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పూనమ్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ సమయంలో తన ప్రైవేట్ వీడియోను తన మాజీ ప్రియుడు వైరల్ చేశాడంటూ చెప్పుకొచ్చింది. అవి చూసిన వారంతా పబ్లిక్ స్టంట్ కోసం ఆమె ఇలాంటివి చేస్తుందని అంతా అనుకున్నారు. ఆ విషయం పై స్పందించిన పూనమ్ అసలు నిజాన్ని బయటపెట్టింది. అలాగే ఈ వీడియోలను కూడా డిలీట్ చేయించిందట. ఇంటర్వ్యూలో పూనమ్ మాట్లాడుతూ.. ‘‘ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు నా మాజీ ప్రియుడికి మధ్య గొడవ జరిగింది. నేను ఫోన్ మర్చిపోయాను. మా నాన్న వద్దకు వెళ్లి జరిగింది చెప్పాను. అప్పుడు మా నాన్న అతడిని బెదిరించాడు. దీంతో నా మాజీ ప్రియుడు ఇంటికి రాకపోతే వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తానని నన్ను బెదిరించాడు. నేను భయపడకుండా రానని చెప్పాను. కోపంతో అతను పా వీడియోలు లీక్ చేసి నా పరువు తీశాడు. అతను రాక్షసుడని తెలుసు కానీ.. మరీ ఇంతటి నీచానికి దిగజారతాడని అనుకోలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.
View this post on Instagram