Anasuya : ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు సులభంగా దగ్గర కావొచ్చన్న అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. తరువాత యాంకర్‌గా , హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో మెప్పిస్తోంది. కొందరు డైరెక్టర్లు ఆమె కోసమే కథలు రాస్తున్నారంటే.. తన ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ.. నెట్టింట్లో ట్రోలింగ్ బారిన పడుతున్నారు.
తనని విమర్శించిన వారికి అంతే రీతిలో ఘాటుగా కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే. 38 ఏళ్ల వయస్సులో కూడా హాట్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. తన ఫిజిక్ మెయిన్టైన్ కోసం తను చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. సోషల్ మీడియాలో తను వర్కౌట్లు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాజుగ్గా కనిపించడానికి అనసూయ జిమ్ లో పడుతున్న కష్టాలను చూసిన నెటిజన్లు తెగ మెచ్చకుంటున్నారు. తాజాగా అనసూయ తన బర్త్ డేని సింపుల్‌గా జరుపుకుంది. ప్రకృతి అందంలో తన బర్త్ డే వేడుకులను జరుపుకుంది. కుటుంబంతో కలిసి పచ్చటి ప్రకృతి అందాన్ని ఆస్వాదించింది.
కొండకోనలు, సెలయేర్ల మధ్య ఆడుతూ పాడుతూ బర్త్ డే వేడుకను ఆస్వాదించింది. ఈ సందర్భంగా తనలోని అందాలను అదే రీతిలో హైలైట్ చేసింది. జీన్స్ పొట్టి నిక్కరు ధరించి థైస్ అందాలతో మగాళ్ల గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం అనసూయ థైస్ షో చేస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.