Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఏకైక హీరోయిన్ నయన్. రెమ్యూనరేషన్ ద్వారా నయనతార ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏ రోల్ అయినా పారితోషికం విషయంలో రూపాయి కూడా తగ్గేదేలే అన్నది ఆమె నైజం అన్నట్లు భోగట్టా.

ఇది ఇలా ఇంటే ఇటీవల కాలంలో నయనతార నిత్యం దేవాలయాల సందర్శకు వెళ్తుంది. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆమె అలా ఎందుకు చేస్తుందని తన అభిమానులకు ఆలోచిస్తున్నారు. నయనతార జాతకంలో గండం ఉందా ..? ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఇలా భర్తతో పూజలు చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచూ సినిమా షూట్స్ కి బ్రేక్ చెప్పి మరి భర్తతో కలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తుంది.
మరీ ఇంత డెడికేషన్ గా ఆమె గతంలో ఎన్నడూ పూజలు చేసింది లేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. నయనతార జాతకంలో గండం ఉందట. ఆ గండం కారణంగా ఆమె వైవాహిక జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అంతేకాదు తన పిల్లలకు కూడా టాప్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చట . ఆ కారణంగానే నయనతార ప్రత్యేక పూజలు చేయిస్తుందట. ప్రస్తుతం ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా పెళ్లి తర్వాత నయనతార హై రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. అంతకుముందు ఆరు ఏడు కోట్లు తీసుకుంటే ఇప్పుడు ఏకంగా 10 – 12 కోట్లు ఛార్జ్ చేస్తుంది. అయినా సరే నయనతార కాల్ షీట్స్ మొత్తం బిజీబిజీగా ఉండడం గమనార్హం.