Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న మధ్యలో వరుస బ్లాక్ బస్టర్లు రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. కానీ మళ్లీ సీన్ రివర్స్ అయింది. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు. దీంతో పూజా బేబీ సోషల్ మీడియాతో టైం పాస్ చేస్తోంది. కానీ ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్‌తో తెగ షికార్లు చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో.. పూజా బేబీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పూజా ఎక్కువగా రోహన్తోనే కనిపిస్తోంది.
రీసెంట్గా పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ కూడా రోహన్ కనిపించాడు. దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు.. ఏకంగా తల్లి కాబోతుందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. నిజంగా పూజా తల్లి కావడం లేదు. సినిమా కోసం తల్లిగా మారాలనే షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజాకు సినిమా ఆఫర్లు పెద్దగా రావడం లేదు. దీంతో.. ఓ సినిమాలో తల్లి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సినిమా మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇస్తామని టెంప్ట్ చేయడంతో పూజా తల్లి పాత్ర అయినా అందుకు ఓకే చెప్పిందట. అయితే.. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. కానీ పూజాకు ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్ బడా డైరెక్టర్ అని తెలుస్తోంది. ఇదే కాదు.. మరోవైపు పూజ దేవరలో ఐటెం సాంగ్ చేయడానికి సై అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో రంగస్థలం, ఎఫ్ 3 సినిమాల్లో స్పెషల్ సాంగులో బ్యూటీగా చిందులేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో స్టెప్పులేయడానికి రెడీ అవుతోందట. ఏదేమైనా.. పూజా తల్లి క్యారెక్టర్ అనేది మాత్రం ఫ్యాన్సుకు మింగుడుపడని విషయమే.