Esther Norha : నటి ఎస్తేర్ వాలెరీ నోర్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించి మెప్పించింది. కమెడియన్ సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమాలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే హీరోయిన్ గా అమ్మడికి సక్సెస్ రాలేదు. అడపాదడపా సినిమాలు చేసినా హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. భీమవరం బుల్లోడు తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో కీలకపాత్రల్లో పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ నటి 2019లో సింగర్ నోయెల్ ను వివాహం చేసుకుంది. కానీ కొన్నాళ్లకే మనస్పర్థలతో అధికారికంగా విడాకులు తీసుకొంది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నోయల్ తో విడాకుల తర్వాత అమ్మడు కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. అమ్మడికి ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె ప్రస్తుతం ఎక్కువగా బోల్డ్ రోల్స్ ఉన్న సినిమాల్లోనే నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నటి ఈ మధ్య టెనెంట్`లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన నటన, యాక్షన్ సీన్లతో అదరగొట్టింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెండో పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్ కావాలి, బ్యూటీఫుల్ లైఫ్ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హాట్ హాట్ గా వైరల్ అవుతున్నాయి.