Gabbar Singh : ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’ ఈ డైలాగ్ ఎంతటి పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా వచ్చి పన్నెండేళ్లు దాటుతున్నా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. గబ్బర్‌సింగ్ క్రేజ్, ట్రెండ్ నేటికీ అలాగే నడుస్తోంది. పదేళ్లు గడిచి, పది సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత పవన్ కల్యాణ్‌కు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ 2012 మే 11న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పవన్ క్రేజ్ కు తగ్గట్లే సూపర్ హిట్ అయింది. సలసలమంటున్న ఎర్రటి ఎండలో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అసలు పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు చెబితేనే యూత్‌లో ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఇక ఆయన సినిమాల్లో చాలా మందికి, గబ్బర్ సింగ్ సినిమా అంటే ఇష్టం ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించడానికి మొదట ఒప్పుకోలేదంట. దబాంగ్ రీమేక్ మీరు చేస్తే బాగుంటుందని దర్శకుడు అడిగారు.. ఇక ఈ సినిమా నేను ఒకసారి చూశాను. ఆ తర్వాత అందులో నేను ఎలా నటించాలో నాకు అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చారు.
కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఎందుకో మళ్లీ గుర్తు వచ్చింది. అప్పుడు నేను హరీశ్ శంకర్ కు ఫోన్ చేసి, సినిమా చేస్తానంటూ చెప్పాను. గుడుంబా శంకర్ సినిమాలో ఓ సన్నివేశాన్ని పూర్తిగా తీసుకుని ఆ సినిమాలో పోలీస్ రోల్ చేశాను. ఇక ఆ తర్వాత సినిమా రెస్పాన్స్ చూసి నేనే షాక్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించిదంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్స్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ సినిమా చేయడం మొదట్లో ఇష్టం లేదా అంటూ షాక్ అవుతున్నారు.