Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కండక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత వెండితెర పైకి వచ్చారు. ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఎంతో శ్రమించి సూపర్ స్టార్ రజినీకాంత్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది కుర్ర హీరోలకు ఈయన ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక తాజాగా తలైవా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించే రజినీ కాంత్ ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను అంటూ రజినీకాంత్ తెలిపారు. ఈ మాటలు విన్న ఆయన అభిమానులు ఒకింత షాక్ కు గురయ్యారు. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. నా లైఫ్ జర్నీ చాలా మందికి తెలుసు. మొదట నేను బస్ కండక్టర్. అంతే కాకుండా నేను చాలా ఆఫీసుల్లో పనిచేశాను. కూలీగా కూడా చేశాను. మాది చాలా నిరుపేద కుటుంబం. కానీ నాకు ఎప్పుడూ ధనవంతున్ని కావాలి అనే కోరిక ఉండేది. అలాగే నేను చాలా ధైర్యంగా ఉంటాను. దాదాపు దేనికీ భయపడకుండా ఉండేవాడిని, అలాంటిది ఒక రోజు మాత్రం నా జీవితంలో మర్చిపోలేని రోజు ఉంది. ఆ రోజు నాకు ఎందుకో బాగా భయం వేసింది. అప్పుడే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ నేను దేవుడిని పూజిస్తూ ఆయన ఫోటో ముందే చాలా సేపు కూర్చుని ఆలోచించడం వల్ల దాని నుంచి బయట పడ్డాను.
తర్వాత ఆ రోజు రాత్రి వచ్చిన కల నా జీవితాన్నే మార్చివేసింది. ఆ రాత్రి నాకు తెల్లటి గడ్డంతో ఉన్న సంతనోర్వా నదికి అవతలివైపు కూర్చొన్న ఓ స్వామి వారు కనిపించారు. తర్వాత నేను తనతో ఓ మఠానికి వెళ్లి ధనవంతుడిని కావాలని కోరుకున్నాను. ఆ స్వామి రాఘవేంద్ర స్వామి అని చెప్పి ప్రతి గురువారం ఉపవాసం ఉండు అంటూ సూచించారు. తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను. అప్పుడు బాలచందర్ నన్ను గుర్తించారు. ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాను అంటూ రజనీ కాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఎన్నో కోట్ల మందికి ఆరాధ్యదైవం అయిన రజినీకాంత్.. మా అభిమాన హీరో సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకున్నారా అంటూ ఒకింత షాక్ అవుతున్నారు.