Hi Nanna: కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే వారిలో ముందుండే హీరో నాని. వాళ్ల కొత్త ఐడియాలతో సినిమాలు చేసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా అందులో జీవిస్తుంటాడు నాని. గతేడాది కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గతేడాది చివర్లో మరో కొత్త డైరెక్టర్ శౌర్యవ్‌తో ‘హాయ్ నాన్న’ సినిమాతో మరొక ఘన విజయాన్ని అందుకున్నాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ తన ఆలోచనా విధానంతో ఆడియన్స్ పల్స్‌ను పసిగట్టి థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి కూతుళ్ల బంధంతో కాస్త లవ్‌ను యాడ్ చేస్తూ తీసిని సినిమా ప్రేక్షకుల కంటతడి పెట్టించింది.
ఇందులో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందం, అభినయంతో కుర్రకారు మనస్సును కొల్లగొట్టింది. ఆమె యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయిపోయారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన అబ్దుల్ వాహబ్.. తన పాటలతో సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లారు. ఆయన అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కౌర్ తో సినీ ప్రియులు మరో లోకానికి వెళ్లినంత ఫీలింగ్ కలిగింది. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి ఎక్కువ లాభాలు గడించాలంటే నాని తర్వాతే ఎవరైనా. నాని సినిమా వస్తుందంటే.. పెద్ద హడావుడి ఉండదు. సైలెంట్‌గా వచ్చి.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక హాయ్ నాన్న సినిమా కూడా తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కింది. రూ.76 కోట్ల వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ అనంతరం ఈ జనవరిలో ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాంటి ఈ మూవీకి తాజాగా అరుదైన ఘనత లభించింది. అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న చిత్రానికి వరుస అవార్డులు వరించాయి. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఈ మూవీ ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహబ్‌కే మూడు అవార్డులు లభించాయి. డైరెక్టర్ శౌర్యువ్‌కు రెండు అవార్డులు.. అలాగే నాని- మృణాల్ ఠాకూర్‌కు ఓ అవార్డు లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు.