Surekha Vani : సురేఖా వాణి ఈ పేరుతో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాల్లో తల్లి, వదిన, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖా వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ పక్కన నటిస్తూ పాపులర్ అయింది. ఇది అలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటినా.. సురేఖా మాత్రం అందంలో తన కూతురుతో పోటీ పడుతూ అదరగొడుతోంది. ఇక సుప్రీత.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ తో దూసుకుపోతూ ఉంటుంది. సురేఖ వాణి తన కూతురిని పెద్ద హీరోయిన్ చేయాలనుకుంటుంది. వారికి సంబంధించిన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇటీవలె బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా.. సుప్రీత హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కనుంది. దీంతో సుప్రీత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. తనకి కొద్ది సమయం దొరికిన సరే ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సుప్రీత అభిమానులతో చిట్ చాట్ చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే ఇదే క్రమంలో ఆమె మీరు మన ఇండస్ట్రీలో పెళ్లి కానీ ఏ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు..? అనే విధంగా నెటిజన్స్ ప్రశ్నించారు.
సుప్రీత ఏం మాత్రం సిగ్గుపడకుండా.. మొహమాట పడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. ఇంకేముంది విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటావా.. నీకు పోయేకాలం దగ్గర పడిందంటూ దారుణాతి దారుణంగా సుప్రీతను ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు చేసుకుంటే తప్పేంటి అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సుప్రీత చేసిన ఒక్క ఆన్సర్ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే సుప్రీత పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.