Pushpa 2 Song : పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. అస్సలు తగ్గేదేలే

- Advertisement -

Pushpa 2 Song : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది. పుష్ప ఫస్ట్ పార్టు పెద్ద హిట్ అవ్వడంతో పాటు సాంగ్స్, బన్నీ మేనరిజం వైరల్ అవ్వడం, అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రావడంతో సీక్వెల్ పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచారు. పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో హీరోగా బన్నీకి.. దర్శకుడిగా సుకుమార్ కు పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ వచ్చింది. భారీ బడ్జెట్ తో ఎక్కడ రాజీ పడకుండా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

పుష్ప సినిమాలో స్మగర్ల్ గా కనిపించాడు అల్లు అర్జున్.. పుష్ప 2 లో సిండికేట్ మెంబర్ గా మారి ఆ సామ్రాజానికే కింగ్ అవుతాడు. ఈ క్రమంలో ఆతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే కథ. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటిలాగానే అదిరిపోయే ట్యూన్ తో అభిమానులకు పండుగ సందడి తెచ్చేశాడు. పుష్ప, పుష్ప , పుష్ప రాజ్ అంటూ సాంగ్ ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్ట్ లో పాటలని ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలను బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవీ. ఈ ఒక్క సాంగ్ తో ఆ విషయం అర్ధమైపోతుంది. పాటతో పాటు బన్నీ లుక్స్ కూడా అదిరిపోయాయి. మొత్తానికి పుష్ప 2 ఫిర్చ్ సాంగ్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

- Advertisement -
Pushpa 2 teaser
Pushpa 2 teaser review

ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్.. లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. పుష్ప తో నేషనల్ అవార్డు, కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇంకే రేంజ్ కి ఎదుగుతాడో సినిమా విడుదలైన తర్వాత చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com