Guess the Actress : ఈ ఫోటోలోని బుడ్డదాన్ని గుర్తుపట్టారా.. ఇప్పుడు దక్షిణాదిని ఊపేస్తుంది

- Advertisement -

Guess the Actress: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయం క్షణాల్లో తెలిసి పోతుంది. అంతేకాకుండా తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల చిన్ననాటి సంగతులు, వారి ఫొటోలు ఎప్పటికప్పుడు నెటిజన్లు ఇంటర్నెట్‌లో వైరల్‌ చేస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో సెన్సేషనల్ హీరోయిన్‎గా దూసుకుపోతున్న ఓ చిన్నదాని చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. పైన ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు మలయాళ నటి మమితా బైజు. అవును, లేటెస్ట్ సెన్సేషన్ ప్రేమలు సినిమాతో మొత్తం దక్షిణాది సినీ అభిమానులను తన వైపు తిప్పుకుంది నటి మమితా బైజు.. తన చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిన్ననాటి ఫోటోలో ఆమెతో పాటు సోదరుడు కూడా ఉన్నాడు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్‌లో మమిత డా.బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించింది.

తనకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు. మమిత తొలుత షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్ శరణ్య లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. రొమాంటిక్ కామెడీ ప్రేమలు సినిమాలో మమితా బైజు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. మలయాళ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే మలయాళంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన రెబల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. దీని తరువాత, రామ్ కుమార్-విష్ణు విశాల్ కలయికలో వస్తున్న సినిమాలో మమిత హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా ఓ యంగ్ హీరో సినిమాలో మమిత నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here