Jabardasth Rohini : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో.. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అదే రేంజ్ లో పాపులర్ అయింది.. జబర్దస్త్ తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో బుల్లితెర కమెడియన్లు మెప్పిస్తున్నారు.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది.. డబుల్ ఫన్ తో ఈ ప్రోమో నిండిపోయింది..
జనవరి 29న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కి బుట్ట బొమ్మ చిత్ర యూనిట్ హాజరయ్యారు.. కార్తీ ఖైదీ చిత్రంలో ఒక విలన్ గా నటించిన అర్జున్ దాస్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అంకిత సురేంద్ర నటించింది.. అంకిత సురేంద్ర ఈ షోలో కనిపించగానే.. చిన్నారి తల్లి పాట వేసి మన కమెడియన్స్ కాస్త హడావుడి చేశారు.. డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆటపాటలతో జబర్దస్త్ కమెడియన్లు ఈ ఎపిసోడ్ లో అదరగొట్టారు. ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ , నరేష్, రోహిణి లా కామెడీ టైమింగ్ అదిరిపోయింది.. అర్జున్ దాస్ వాయిస్ కి నేను ఫిదా అంటూ రాంప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఇక అసలైన ఆట మ్యూజికల్ చైర్ గేమ్ లో అర్జున్ దాస్ పాల్గొన్నారు. కాగా ఈ గేమ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జోడిని ఎత్తుకొని చైర్స్ చుట్టూ తిరగాలి . అర్జున్ దాస్ బుల్లితెర నటి నవ్య స్వామిని ఎత్తుకొని ఈ గేమ్ లో ఆడాడు. ఆమెని ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అని రాంప్రసాద్ అడగగా.. గుడ్ వర్క్ అవుట్ అని అర్జున్ దాస్ అన్నారు. అయితే మీ వర్క్ అవుట్ ని ఇంకా పెంచుతాను ఉండండి అంటూ.. జబర్దస్త్ రోహిణి రాంప్రసాద్ పిలుస్తాడు.. జబర్దస్త్ రోహిణి వైపు అర్జున్ దాస్ చూసిన చూపులు స్టేజ్ పై నవ్వులు పూయించాయి..
అర్జున్ దాస్ ఛాలెంజ్ గా తీసుకుని రోహిణిని ఎత్తుకొని చైర్స్ చేసి చుట్టూ తిరిగారు.. వెంటనే రష్మి అక్కడికి వచ్చి.. రోహిణి అర్జున్ దాస్ నీ బరువు మోసారు. నీ బాధ్యతలు కూడా మోస్తారు అని అనగానే.. రోహిణిలో అర్జున్ దాస్ పై ప్రేమ చిగురించింది. రొమాంటిక్ గా అర్జున్ చేయి పట్టుకొని చూసింది. అర్జున్ దాస్ కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తున్నట్లు చూసి.. వెంటనే నావల్ల కాదు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తాడు.. మొత్తానికి బుట్ట బొమ్మ టీం పాల్గొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్ కోసం ఈ నెల 29 వరకు వచ్చి చూడక తప్పదు.