Samantha : కొంతమంది మారినా సంతోషమే.. అభిమానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత

- Advertisement -

Samantha : సమంత రూత్ ప్రభు.. ఎప్పుడైతే ఏమాయ చేశావే అంటూ సినిమాల్లోకి అడుగు పెట్టిందో… ఫస్ట్ సినిమాతో అభిమానులను తన మాయలో పడేసుకుంది. ఆ సినిమా తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా చాటింది. ఆమె గొప్ప నటిగానే కాకుండా స్టైల్ ఐకాన్ కూడా. ఆమె ఫ్యాషన్ సెన్స్ కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. నటన, ఫ్యాషన్‌తో పాటు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై కూడా సమంత చాలా శ్రద్ధ చూపుతుంది. ఆమె తరచుగా ఈ విషయాలపై మాట్లాడటం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశాలపై అవగాహన కల్పిస్తూ ఎదురవుతున్న సమస్యల గురించి మరో సారి మాట్లాడింది.

Samantha
Samantha

సమంత ప్రస్తుతం మయోసైటీస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టి.. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా మొదలు పెట్టింది. అందులో ఆరోగ్యంతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాను కేవలం రోజుకు ఆరు గంటలు మాత్రమే నిద్రపోతానని పేర్కొంది. ఇక తన బాల్యం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన చిన్నతనం నుంచే జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో తరచూ విజయంపై ఫోకస్ పెట్టానంటూ వివరించింది. అయితే ఆ లక్ష్యమే తనని గెలుపు సాధించడానికి తోడ్పడిందని తెలిపింది.

- Advertisement -

సమంతను ఇష్టపడే వారి జాబితా చాలా పెద్దది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత, సౌత్‌తో పాటు, హిందీలో కూడా తన పట్టు నిలుపుకునేందుకు ట్రై చేస్తుంది. ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 34 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సమంత ఎప్పటికప్పుడు సోషల్ అవేర్‌నెస్‌పై మాట్లాడుతూనే ఉంటుంది. ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో.. అతను తన అభిమానుల దృష్టిని వినోదం నుండి శారీరక , మానసిక ఆరోగ్యం వైపు మళ్లించడంలో ఇబ్బందుల గురించి మాట్లాడింది. నా అభిమానులకు వినోదం, ఫ్యాషన్, మేకప్‌పై ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రజల ఆలోచనలను మార్చడానికి, మంచి మార్పు తీసుకురావడానికి సహనం కలిగి ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ఆమె చేయగలిగినదంతా చేస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పనితో పాటు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here