Alia Bhatt : నాకు ఇదే ఫస్ట్ టైం.. వైరల్ అవుతున్న అలియా భట్ శోభనం వీడియో

- Advertisement -

Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2012లో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సక్సెస్ లు అందుకుంటూ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. హైవే, 2 స్టేట్స్‌, కపూర్‌ అండ్‌ సన్స్‌, ఉడ్తా పంజాబ్‌, రాజి, డియర్‌ జిందగీ, గల్లీ బాయ్‌, సడక్‌ 2 లాంటి బంపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు, ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలతో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇలా సినిమాలు, ప్రకటనలతో బాగానే ఆదాయం ఆర్జిస్తోంది అలియా భట్‌. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయింది. ప్రస్తుతం అలియా భట్ కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్త రణ్ బీర్ కపూర్ కాకుండా మరో హీరో రణ్ వీర్ సింగ్ తో శోభనం చేసుకుంటున్న వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. అలియా భట్, రణ్‌వీర్ కలిసి జంటగా ఓ యాడ్ చేశారు. మేక్ మై ట్రిప్ కోసం చేసిన యాడ్‌లో రణ్‌వీర్, అలియా భట్ పెళ్లైన కొత్త జంటగా కనిపించారు. శోభనం గదిలో అలియ బెడ్‌పై కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరకు భర్త రణ్‌వీర్ సింగ్ వస్తాడు.

- Advertisement -

నాకిదే ఫస్ట్ టైం అని అనడంతో.. అలియా స్పందిస్తూ నాకూడా ఫస్ట్ టైమ్ అంటుంది. అయితే టెన్షన్ పడకు ఈజీగానే అయిపోతుందని అలియాకు ధైర్యం చెబుతాడు. దీంతో రణ్‌వీర్ ఇది ప్రయాణమే కదా గమ్యం కాదని అంటాడు. ఆ తర్వాత అలియా భట్ మొదలు పెడదామా అని.. మొబైల్ తీసి నేను మేక్‌పై ట్రిప్‌లో ఫారీస్ హనీమూన్‌కు ఫ్లైట్స్ చూస్తానంటుంది. ఇక రణ్‌వీర్ నేను హోటల్స్ చూస్తానని చెప్పి ఇద్దరు కలిసి ఫోన్ చూస్తుంటారు. ఫస్ట్ టైమ్ జర్నీ చేయడానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం రణ్‌వీర్, అలియా భట్ యాడ్ అందరినీ ఆకర్షించింది.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here