Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ పేరు ఇప్పుడు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. హను రాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. గతేడాది నేచురల్ స్టార్ నానితో జతకట్టింది. హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా చేసింది. హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మృణాల్ ఠాకూర్ గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ రెండు సినిమాల తర్వాత ఇటీవలె విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా మృణాల్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. తెలుగులో ఈ అమ్మడికి మరిన్ని బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
రీసెంట్ గా మృణాల్ మాట్లాడుతూ.. కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి. రిలేషన్స్ షిప్స్ మెయింటేన్ చెయ్యడం చాలా కష్టం అన్న విషయం నాకు తెలుసు. మనల్ని అర్ధం చేసుకునే పార్టనర్ రావడం కూడా అవసరం. అలాగే నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నానంటూ షాకింగ్ విషయం తెలిపింది. ప్రస్తుతానికి కెరీర్ పైనే నా దృష్టి . ఒక దశ స్టేజ్ తర్వాత తమ నిల్వ చేసిన అండాలతో పిల్లలను కనడం ఇప్పుడు కామన్ అయ్యిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా.. కానీ బిడ్డను కనే ఆలోచన లేదంటూ చెప్పింది. మృణాల్ కూడా కొన్నిసార్లు తాను అభద్రతా భావాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తాను బాడీ షేమింగ్‌కు గురయ్యానని తెలిపింది.