Bigg Boss Swetha: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ షో ద్వారా ఎంతో మంది తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. అలాగే సినీపరిశ్రమలో ఎన్నో ఆఫర్లను సైతం అందుకున్నారు. ఇప్పటివరకు 7 సీజన్లు విజయవంతంగా రన్ అయ్యాయి. బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయినవారిలో శ్వేతా వర్మ ఒకరు. ఈ షోకు రాకముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది శ్వేతా వర్మ. రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, రోజ్ విల్లా వంటి పలు చిత్రాల్లో నటించింది. సపోర్టింగ్ యాక్టర్‌గా అనేక సినిమాల్లో కనిపించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే బిగ్‌బాస్ తర్వాత గుర్తింపు మాత్రమే వచ్చింది కానీ.. ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదు. చాలా రోజులుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

తన మీద ఒక వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ ద్వారా శ్వేతా వర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఒక వ్యక్తి ఆమె గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో బాధపడుతూ శ్వేత వర్మ ఒక మనిషి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది?.. అతని అమ్మకి కూడా ఎవరైనా ఇలాగే చెబితే అతను ఫర్వాలేదు అనుకుంటాడా అని ఆమె ప్రశ్నించింది.
అంతేకాదు అతని వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తోంది. నాకున్న కాంటాక్ట్ ద్వారా అతని అడ్రస్, అతని కాంటాక్ట్ కూడా సంపాదించాను. అది రియల్ అకౌంటా? లేదా ఫేక్ అకౌంటా అని ఆలోచన అక్కర్లేదు.. అది ఏదైనా తెచ్చిపెట్టే నాకున్న సోర్స్ అలాంటిది. అతని కాంటాక్ట్ అలాగే అడ్రస్ కూడా నేను పోస్ట్ చేయగలను కానీ నేను చేయను. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. ఇది చూసి అతను ఒక గుణపాఠం నేర్చుకుంటే చాలా మంచిదని నేను భావిస్తున్నారు. ఇలాంటి దరిద్రపు పనులు రీపీట్ చేయకుండా ఉంటే మంచిది. అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చింది.