Suriya – Jyothika : ఇండియాలో ది బెస్ట్ సెలబ్రిటీ కపుల్, క్యూట్ కపుల్, లవ్లీ కపుల్, పవర్ కపుల్.. ఇలా ఈ లిస్టులో దేని గురించి అడిగినా.. ఆ జాబితాలన్నింటినిలో తమిళ్ స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక పేర్లు టాప్ లో ఉంటాయి. దంపతులు.. అనే బంధానికి వీళ్లు ఇచ్చిన నిర్వచనం చాలా స్పెషల్. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో సపోర్ట్ చేస్తూ ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఓ సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత స్నేహం, అది ప్రేమగా మారి పెళ్లవ్వడం జరిగింది. అలా దాదాపు 18 ఏళ్ల నుంచి ఈ జంట సాఫీగా తమ ప్రయాణాన్ని సాగిస్తోంది.
అయితే రీల్ లైఫ్లో, రియల్ జీవితంలో హిట్ జంటగా పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక 1999లో విడుదలైన పూవెల్లామ్ కేట్టుప్పార్ చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు కలిసి చేస్తూ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు చేస్తూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అనుమతితో 2006లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం జ్యోతిక నటనకు దూరంగా ఉన్ జ్యోతిక పిల్లలు పెద్దవ్వడంతో మళ్లీ 36 వయదినిలే చిత్రంతో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఇటీవల సైతాన్ మూవీతో బాలీవుడ్ లో నూ ఎంట్రీ ఇచ్చారు.
సూరారై పోట్రు, జై భీమ్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూర్య తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం సూర్య చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. మొదటగా కంగువా మూవీని పూర్తి చేసి ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా ఇద్దరూ తమ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో ఈ జంట గురించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే?
సూర్య – జ్యోతిక దాదాపు 18 ఏళ్ల తరువాత కలిసి నటించడానికి రెడీ అవుతున్నారట. ఈ మూవీకి సిల్లు కరుప్పట్టి చిత్ర దర్శకురాలు హలితా షమీమ్ లేదా బెంగుళూర్ డేస్ చిత్రం ఫేమ్ అంజలి మీనన్ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ ఫేవరెట్ పెయిర్ ను ఆన్ స్క్రీన్ పై మళ్లీ కలిసి చూడబోతున్నామని హ్యాపీగా ఫీలవుతున్నారు. ఒకవేళ ఈ చిత్రం ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య- జ్యోతిక కలిసి నటించబోతున్న మొదటి సినిమా ఇదే అవుతుంది.