Sridevi : అలనాటి అందాల తార.. అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో తన అందం, నటనతో తెలుగు తెరను ఓ ఊపు ఊపేసింది. ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ఈ అమ్మడు.. క్లాస్, మాస్, రొమాంటిక్ ట్రెడిషనల్ ఏ పాత్రైనా సరే ఓ రేంజ్ లో అల్లాడించేసేంది. సావిత్రి గారి తర్వాత ఇండస్ట్రీలో అలాంటి స్టార్ స్టేటస్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్ శ్రీదేవి అని చెప్పడంలో సందేహం లేదు. కొన్నేళ్ల క్రితం అనూహ్య రీతిలో మరణించింది. శ్రీదేవి దుబాయిలో తన బంధువుల పెళ్ళికి వెళ్ళిన ఆమె ఓ హోటల్ గదిలో బాత్ డబ్బులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇప్పటి వరకు కూడా ఆమె మరణానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఊహాజనితంగానే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవి మృతికి ఇదే కారణమంటూ.. మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..?
గుర్తుండిపోయేలాంటి ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేసి ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్న శ్రీదేవికి సినిమానే ప్రపంచం. ఈ క్రమంలోనే ఆమె చనిపోయేంత వరకు కూడా సినిమానే ప్రపంచంగా బ్రతికింది. ఒకానొక సమయంలో ఆమె చనిపోవడానికి కారణం భర్త బోనీకపూరే అంటూ ప్రచారం కూడా జరిగింది. భర్త బోనికపూర్ శ్రీదేవి మరణానికి కర్త కర్మ క్రియ అంటూ చాలా చాలా ట్రోల్ చేశారు. అయితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లమెల్లగా శ్రీదేవిని మర్చిపోతూ బోనీ కపూర్ ని చూసుకుంటూ ముందుకెళ్లిపోయింది. అంతే కాకుండా హీరోయిన్గా తన గ్లామర్ దెబ్బతినకూడదని చాలా కఠినమైన నియమాలు పాటించేదట. అయితే ఈ కఠినమైన ఆహార నియమాల కారణంగా శ్రీదేవికి అప్పుడప్పుడు కళ్లు తిరుగుతూ.. ఇబ్బందిపడేదని ఫ్యామిలీ మెంబర్స్ చెపుతుంటారు. ఇందులో భాగంగానే బాత్ టబ్‌లో పడిపోయిన శ్రీదేవి.. నీటిలో ఊపిరి ఆడక చనిపోయిందని భర్త బోనీకపూర్ చాలా సందర్భాల్లో చెప్పారు.
అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. శ్రీదేవి మరణానికి మరోకారణం కూడా ఉందట. శ్రీదేవికి చిన్ననాటి నుంచే జలగండం ఉందట. దాని వల్లే ఆమె ఇలా మరణించిందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే ఓ గండం నుంచి బయటపడిందట. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ చాలా వైరల్ అవుతోంది.