Sneha : ఒకప్పటి హీరోయిన్ స్నేహ గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం, అమాయకత్వం కలగలిపి హోమ్లీ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. 2009లో ఓ తమిళ సినిమాలో నటుడు ప్రసన్నతో నటించి ప్రేమలో పడింది. 2012లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలను పోషిస్తోంది.
రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా చీరల బిజినెస్ లో దిగిన ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆమె మాట్లాడుతూ పోసెసివ్నెస్ ఉండాలి కానీ.. అతిగా ఉండకూడదంటూ చెప్పుకొచ్చింది. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేమని.. బయటకు ఎందుకు.. ఈ టైం లో ఏం చేయడానికి వెళ్తున్నావ్.. అలాంటి ప్రశ్నలు తలెత్తకూడదని.. అవతలి వ్యక్తి ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావంటూ చెప్పుకొచ్చింది.
పెళ్లంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలంటూ మాట్లాడిన స్నేహ.. ఒకరు మనల్ని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకముందే నేను ఫలానా చోటుకు వెళుతున్న.. ఆ సమయంలోపు వచ్చేస్తా.. అన్న సమాచారం ఇవ్వాలని.. అక్కడికి వెళ్లాక కూడా మీకు టైం ఉంటే ఒకసారి మీ పార్టనర్ కు ఫోన్ చేసి నేను చేరుకున్న.. నువ్వు భోజనం చేశావా లాంటి కుశల ప్రశ్నలు అడిగితే ప్రేమ, నమ్మకం మరింత బలపడతాయని చెప్పింది. పెళ్లయిన కొత్తలో నేను కూడా పొసెసివ్ గా ఉండే దానినంటూ వివరించింది. కాకపోతే దాని అర్థం నాకు అతనిపై నమ్మకం లేదని కాదు. గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి ఆ బ్రేకప్ జరగకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికే వాడే కాదు. అయితే అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చి పడడంతో ఆ ఏడాదంతా చాలా ఇబ్బందిగా గడిచింది. మానసిక ఒత్తిడికి లోనయ్యా.. సరిగ్గా అప్పుడే నేను ఉత్తమ నటిగా తమిళ్లో ఫిలిమ్ అవార్డు అందుకున్నానంటూ స్నేహా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తుంది స్నేహా.