Allari Naresh : అల్లరి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయిన అల్లరి నరేష్ ఆ సినిమా తో పేరుకు ముందు అల్లరి చేర్చుకున్నాడు. అల్లరి నరేష్ గానే పాపులర్ అయ్యిపోయాడు. అయితే నరేష్ గురించి మనకి ఎన్నో విషయాలు తెలుసు కానీ తన భార్య ఎవరు..? ఆమె ఏం చేస్తోంది అనే విషయాలు తెలియవు.
మరి ఇక అల్లరి నరేష్ భార్య ఎవరు అనేది చూసేద్దాం. అల్లరి నరేష్ భార్య విరూపా కంఠమనేని. అల్లరి నరేష్ విరూపా ని మే 29 2017న పెళ్లి చేసుకున్నాడు. విరూపా ఎక్కువగా సినిమాలు చూడరు. ఆమె కి సినిమాలు మీద నాలెడ్జ్ కూడా లేదు. పెళ్లి కి ముందు ఆమె అల్లరి నరేష్ సినిమా ఒక్కటి కూడా చూడలేదట ఇప్పటి వరకు నరేష్ నటించిన సినిమాల లో ఈమె కేవలం జేమ్స్ బాండ్ మాత్రమే చూసారు.
ఈమె ఆర్కిటెక్ గా పని చేస్తోంది సొంతంగా ఆఫీస్ ని కూడా స్టార్ట్ చేసింది విరూపా. ఈమె విజయవాడ కి చెందిన అమ్మాయి. వీళ్లది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్ ఏ. అల్లరి నరేష్ కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతనే ఆర్యన్ రాజేష్. ఆర్యన్ రాజేష్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కానీ అంత పెద్ద స్టార్ అవ్వలేక పోయాడు. ఆర్యన్ రాజేష్ కి సినిమాల్లో కలిసి రాక పోవడంతో సినిమాలకి దూరం అయ్యాడు.