Sunny Leone : పెళ్లి చేసుకుంటానంటూ ఒక వ్యక్తి తనని మోసం చేశాడని బాలీవుడ్ నటి సన్నీలియోన్ వెల్లడించారు. ఆ క్షణం ఎంతో బాధపడ్డానని చెప్పారు. ‘‘గతంలో నాకొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో ఏదో తప్పు జరుగుతోందని నా మనసుకు అనిపించింది. చివరకు నేను ఊహించిందే జరిగింది. అతడు నన్ను మోసం చేశాడు.
‘‘నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా?’’ అని ప్రశ్నిస్తే లేదన్నాడు. అన్నీ సిద్ధం చేసుకుని మరో రెండు నెలల్లో పెళ్లి అనగా ఇలా జరగడం నన్నెంతో బాధించింది. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చాడు. డానియల్ వెబర్‌ను పరిచయం చేశాడు. నా తల్లితండ్రులు చనిపోయిన సమయంలో అండగా నిలిచాడు. మనసులు కలవడంతో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. భగవంతుడు మనకోసం గొప్ప ప్రణాళిక సిద్ధం చేస్తాడు. ఏదో ఒక సమయంలో తప్పకుండా ది బెస్ట్ పొందేలా చేస్తాడు’’ అని సన్నీలియోన్ అన్నారు.
హిందీలో తెరకెక్కిన పలు కార్యక్రమాలు, చిత్రాలతో నటిగా సన్నీలియోన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కరెంట్ తీగ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘షీరో’, ‘కోకా కోలా’, ‘యుఐ’ చిత్రాల కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. 2011లో డానియల్ వెబర్‌తో ఆమె వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తూ.. ఆదర్శంగా నిలుస్తోంది.