హీరో సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సిద్ధార్థ్ అందరికీ సుపరిచితమే తెలుగులో కూడా పలు సినిమాలు చేసి అందరిని ఆకట్టుకున్నారు ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలు చేసి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు సిద్ధార్ద్. అయితే ఈయన సినిమాల్లో కంటే ఈ మధ్య వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తున్నారు. సిద్ధార్థ్ కి సంబంధించిన అనేక విషయాలు ఈ మధ్య బయటపడ్డాయి నటి అతిధి రావ్ హైదరితో ప్రేమలో ఉన్నారని ఎప్పటినుండో గుసగుసలు వినపడ్డాయి. తెలుగులో కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి ఆదరణ పొందరు సిద్ధార్థ్. అయితే అతిథితో ప్రేమలో ఉన్నారని వాళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
తెలంగాణలో ఒక ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. ఈ వేడుక కి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రహస్యంగా నిశ్చితార్థం జరుపుకోవడం పట్ల ఇటీవల సిద్ధార్థ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. మేం రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అని అందరూ అనుకుంటున్నారు సీక్రెట్ ప్రైవేటు అనే పదాలకి చాలా తేడా ఉందని అన్నారు.
ఎంగేజ్మెంట్ కి ఎవరినైతే పిలవలేదు వాళ్ళందరూ కూడా ఇది సీక్రెట్ ఎంగేజ్మెంట్ అని అనుకుంటున్నారు ఈ ఎంగేజ్మెంట్ మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ గా జరిగిందని సిద్ధార్ద్ అన్నారు. మీ ప్రపోజల్ ఓకే చెప్పడానికి అదితి ఎన్ని రోజులు సమయం తీసుకుంది అనే ప్రశ్న కూడా ఆయనకి ఎదురయింది. ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగకండి ఎస్ చెప్తుందా లేదా నో చెప్తుందా అనేది ఫైనల్ రిజల్ట్. ఆమె ఏం చెప్తుందా అనే విషయం గురించి టెన్షన్ పడ్డాను అని ఎస్ చెప్పడంతో నా పేరు పాస్ లిస్టులోకి వెళ్లిందని ఈ సందర్భంగా సిద్ధార్ద్ చేసిన వంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.