Sri Devi : సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి మరణం ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె బయోపిక్ వస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వార్తలపై ఆమె భర్త బోనీ కపూర్ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ.. తన భార్య చాలా ప్రైవేట్ వ్యక్తి అని.. ఆమె జీవితంలో జరిగే విషయాలను ఎప్పుడూ బయటకు చెప్పలేదని.. ఎప్పటికీ ఆమె జీవితంలో అలా ప్రైవేట్ గానే ఉండాలని అన్నారు. తాను బతికున్నంతవరకు శ్రీదేవి బయోపిక్ రానివ్వను అని అన్నారు. ఇటీవల డీఎన్ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. “శ్రీదేవి చాలా ప్రైవేట్ వ్యక్తి. ఆమె జీవితంలో జరిగే విషయాలను ఇతరులతో పంచుకోదు. ఆమె జీవితం ప్రైవేట్‌గా ఉండాలి. ఆమె బయోపిక్ తెరకెక్కిస్తాను అంటే నేను అంగీకరించను. నేను జీవించి ఉన్నంతవరకు బయోపిక్ రానివ్వను ” అని అన్నారు.
కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా బయోపిక్ తీయడం అసాధ్యం. కాబట్టి శ్రీదేవి బయోపిక్ పెద్ద తెరపైకి రావడం అనుమానమే. అయితే శ్రీదేవి బయోపిక్ వెండితెరపైకి రావడం కంటే. పుస్తకంగా రాబోతుంది. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్. ఇందుకు ఆమె కుటుంబసభ్యుల పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన కామెంట్స్ మాత్రం హీట్ పెంచుతున్నాయి.