Chiranjeevi తన జర్నీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనలా ఎదగాలని ఆయన ఫోటోని నిత్యం చూస్తూ ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. మరి చిరంజీవి రోజు ఎవర్ని చూస్తూ స్ఫూర్తి పొందుతుంటారో తెలుసా..? ఈ రహస్య విషయం రీసెంట్ ఈవెంట్ లో బయటకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ లో మహానటి సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని బుక్ ని లాంచ్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. చిరంజీవిని మొదటిసారి కలుసుకున్న సందర్భంలో జరిగిన విషయాన్ని అందరితో పంచుకున్నారు.
విజయ చాముండేశ్వరి చిరు ఇంటికి వెళ్ళినప్పుడు.. చిరంజీవి కాలికి గాయం అయ్యి ఉందట. అయినాసరి ఆమె వచ్చిందని తెలుసుకున్న చిరంజీవి.. పైన రూమ్ లో నుంచి కర్ర సహాయంతో క్రిందకి వచ్చారట. ఇక వచ్చిన తరువాత విజయ చాముండేశ్వరికి ఎంతో మర్యాధ చేశారట. అలాగే ఆమెతో మాట్లాడుతూ.. “నేను రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాను. నా బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది” అని చెప్పారట. మళ్ళీ ఆమె నమ్ముతారో లేదో అని సందేహం కలిగి పైకి వెళ్లి ఆ ఫోటోని తీసుకువచ్చి విజయ చాముండేశ్వరికి చూపించారట.
చిరంజీవి విషయంలో తనకి నచ్చింది ఇదే అని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. కొందరు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసింది ఒకటి ఉంటుంది. కానీ చిరంజీవి విషయంలో ఆలోచన, మాట, ఆచరణ మూడు ఒకటే ఉంటాయని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. అందుకనే సావిత్రి క్లాసిక్స్ బుక్ ని చిరునే లాంచ్ చేయాలని భావించి.. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించినట్లు చెప్పుకొచ్చారు.