Ajay Devgn : ఆ స్టార్ హీరో కారణంగా ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ.. నిజం ఒప్పేసుకున్నాడు

- Advertisement -

Ajay Devgn : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో, కామిక్ టైమింగ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన సెట్లో ఉంటే సందడిగా ఉంటుందని సహచర నటులు పొగిడేస్తుంటారు. అందరని సరదగా ఆటపట్టించే గుణం కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. షూటింగ్ సమయంలో ఎప్పుడు నవ్వుతూ.. తన సహనటులను, చిత్ర బృందాన్ని నవ్విస్తూ ఉంటాడు. ఆయనకు ఉండే ఈ కామెడీ గుణమే ఓ సహనటుడి భార్య సూసైడ్ చేసుకునేంత పనికి దారి తీసిందట. ఇటీవలే ఓ ఆయన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సైతాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

 Ajay Devgn
Ajay Devgn

ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మేము ఎక్కువగా ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లేవాళ్లం. మా సహానటుడులో ఓ వ్యక్తికి అప్పుడే కొత్తగా పెళ్లైంది. నైట్ టైం షూటింగ్ ఉండటంతో.. షూటింగ్ పూర్తి చేసుకుని మార్నింగ్ ఇంటికి వెళ్లేవాడు. అయితే.. నేను అతడి భార్యతో ఒకసారి నైట్ షూటింగ్ ఏం జరగలేదు. నేను రాత్రి 10:30 గంటలకు ఇంటికి వచ్చేశాను. మీ భర్త ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఉన్నాడని సరదాకి చెప్పాను.

- Advertisement -

ఇలా దాదాపు 8రోజులు చెప్పడంతో 9వ రోజు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏవో టాబ్లెట్స్ మింగేసిందట. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లే అంతా పని అయింది. ఇక ఆమె ఇప్పటికి కూడా తన భర్తను అనుమానిస్తూ.. ఫోన్లు చెక్ చేస్తూ ఉంటోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అజయ్ దేవగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మాత్రం ఇలాంటి విషయాల్లో ఎవరైనా కామెడీ చేస్తారా అంటూ ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here