Rashmi Gautham : నేను పెళ్లికి రెడీ అంటున్న రష్మీ గౌతమ్.. అబ్బాయి ఎవరంటే ?

- Advertisement -

Rashmi Gautham : బుల్లితెర క్రేజీ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు నిత్యం ఏదో ఒక వార్తలో సెంటరాఫ్ కాంట్రవర్సీగా నిలుస్తూ వస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రష్మీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ గ్లామర్ డోస్ పెంచుతున్న రష్మీ.. తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.

Rashmi Gautham
Rashmi Gautham

రష్మీ గౌతమ్ పేరుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి అయినా.. దాదాపు దశాబ్దం కాలంగా తెలుగు ఇండస్ట్రీలో రానిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తన డ్యాన్స్ లతో మాటలతో యూత్ గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడుకు మెజార్టీ ఫాలోవర్స్ యూత్ మాత్రమే. ఈ అమ్మడు నటిగా కెరీర్ ను ప్రారంభించినా జబర్ధస్త్ యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది.. మరోవైపు హీరోయిన్ గా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి.. ఆ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చేశారు.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోవార్త వినిపిస్తుంది.. అమెరికా అబ్బాయితో రష్మీకి పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది. రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు జాతకాలు చూపించారట. త్వరలోనే అధికారికంగ పెళ్లి పై ప్రకటన వస్తుందని సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here