Chiranjeevi – Vijay Devarakonda : మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి నేడు ‘తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్’ ఈవెంట్ లో పాల్గొన్నారు. గతంలో వీరిద్దరూ గీతగోవిందం సక్సెస్ ఈవెంట్ లో కలిసి కనిపించారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఈవెంట్ లో కనిపించారు. అయితే ఈ ఈవెంట్ లో ఒకే వేదిక పై కనిపించడమే కాదు, ఓ స్పెషల్ చిట్ చాట్ సెషన్ ని కూడా నిర్వహించారు. ఇక ఈ చిట్ చాట్ సెషన్ లో విజయ్.. చిరు ప్రయాణం గురించి, ఆయన సక్సెస్ గురించి, విజయాలు గురించి ప్రశ్నిస్తూ వచ్చారు. ఈక్రమంలోనే విజయ్ ఈ ప్రశ్న అడిగారు..
“మీరు మెగాస్టార్ అవుతానని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకునే స్థాయికి ఎదుగుతానని ఎప్పుడైనా ఊహించారా” అని ప్రశ్నించారు. దీనికి చిరంజీవి బదులిస్తూ.. “అవును ఊహించాను. ఈ పొజిషన్ కి రావాలని ఊహించాను” అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి స్కూల్ అండ్ కాలేజీ టైములో నాటకాలు వేసేవారు. ఆ సమయంలో చిరంజీవి ఎక్కడైనా బయట కనిపిస్తే.. ఆ నాటకంలో నటించింది ఇతనే అని ఒక సెలబ్రిటీగా చూసేవారట. అది చిరంజీవి బాగా నచ్చేసింది. తనని ఒక హీరోలా ట్రీట్ చేయడం బాగా నచ్చింది. చదువుల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న రాని గుర్తింపు, యాక్టింగ్ వల్ల వస్తుందని అనుకున్నారు. దీంతో యాక్టింగ్ వైపు రావాలని నిర్ణయించుకున్నారట.
ఒక పెద్ద స్టార్ అవ్వాలని, అందరూ తన గురించి మాట్లాడుకోవాలని కలలుగనేవారు, ఊహల్లో ఉండేవారట. ఆ కలలను, ఊహలను నిజమే చేసుకునే నేడు మెగాస్టార్ ని అయ్యినట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఈవెంట్ లో ఫ్యామిలీ బాండింగ్స్ గురించి కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీ స్టార్ తన తండ్రే అని చెప్పుకొచ్చిన చిరంజీవి.. కుటుంబంలో ఎలాంటి విబేధాలు ఉన్నా, ఎప్పుడో ఒకసారి అందరూ కలుసుకుంటే అన్ని పోతాయి. అందుకునే మేము పండుగల టైమ్స్ లో కలుస్తుంటాము అని పేర్కొన్నారు.
Who is your #FamilyStar #Chiranjeevi garu pic.twitter.com/DKPufaqdFh
— Team Deverakonda (@TeamDeverakonda) March 31, 2024