VIjay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కాకుండా బాలీవుడ్ లో విజయ్ కి అభిమానులున్నారు. ఈ తరం యంగ్ హీరోల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదనే చెప్పాలి. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు విజయ్ రేంజ్ ని పెంచేశాయి. అలాంటి వ్యక్తికి రీసెంట్ గా బ్రేకప్ అయిందట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు.
వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం సహజమేనని చెప్పిన ఆయన ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడాన్ని అంగీకరించనని తెలిపారు. ‘‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఉదాహరణకు నా స్నేహితులు చాలామంది రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు. దానివల్ల కొన్నేళ్లపాటు బాధ అనుభవించారు. ఆ తర్వాత మరొకరిని కలిశారు. ప్రేమలో పడ్డారు. కాబట్టి, వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది.
ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్ కాలేదు. కొత్త దర్శకులతో వర్క్ చేయాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, అనుభవం లేకుండా బడ్జెట్, మేకింగ్‌ను మేనేజ్ చేయడం క్లిష్టమవుతుంది. ఒక్క సినిమా అయినా చేసిన దర్శకుడితో వర్క్ చేస్తా. సినిమా మేకింగ్‌పై అవగాహన ఉంటుంది. అతడి గత చిత్రం హిట్, ఫ్లాప్ అనేది చూడను’’ అని బదులిచ్చారు. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. ‘డాడీ’లో బన్నీ డ్యాన్స్ చూసి అబ్బురపడినట్టు చెప్పారు.