Bigboss Priyanka : బుల్లితెర నటి ప్రియంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్బాస్ సీజన్-7 షోలో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకుంది. అన్నీ టాస్కుల్లో మేల్ కంటెస్టెంట్లకు ధీటుగా తనదైన ఆటతీరును కనబరిచి టాప్ 5గా నిలిచింది. అయినప్పటికీ వారితో పోటీ పడలేక విన్నర్ కాలేకపోయింది. అయితే ప్రియాంక బిగ్బాస్ ఇంటి నుంచి వచ్చాక ఏ కొత్త సీరియల్స్ ఒప్పుకోలేదు. కానీ తన ప్రియుడు శివ కుమార్తో కలిసి యూట్యూబ్ చానల్లో వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంది.
తాజాగా, బిగ్బాస్ వెళ్లి వచ్చిన తర్వాత తన ప్రియుడితో గొడవలు పడినట్లు సమాచారం. ఆమెను శివ కుమార్ అసలు ఆ షోకు ఎందుకు వెళ్లావంటూ గొడవ పెట్టకోవడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది. ఇదంతా ఆమె వీడియో తీసి తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేసింది. అందులో ప్రియాంక – శివ విపరీతంగా గొడవ పడ్డారు. శివ.. నీతో టైమ్ స్పెండ్ చేద్దామంటే అసలు కుదరడం లేదంటూ ప్రియాంక పై ఫుల్ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా బిగ్బాస్’కు వెళ్లి వచ్చిన తర్వాత ఒంటి గంటకు లేస్తున్నావు. లంచ్ చేసే సమయంలో టిఫిన్ తింటున్నావు. ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉందామంటే వీడియో చేసుకుంటూ కూర్చుంటున్నావు. పొద్దున నుంచి నేనేం తినలేదు. ఇప్పుడు ఆకలేస్తుంది 5 గంటలకు ఎవరైనా టిఫిన్ తింటారా.. అని అంటాడు.
దానికి ప్రియాంక.. నేను చెప్పానా నీకు బ్రేక్ ఫాస్ట్ చేయొద్దని అంటుంది. నీకు తెలుసు నేను టిఫిన్ తినను డైరెక్ట్ లంచ్ తింటానంటూ వేలు చూపిస్తూ అంటుండగా.. ప్రియాంక చేయి చూపించి మాట్లాడకు అంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ కాస్త పెరగడంతో నీకు ప్రాబ్లం ఉంటే వెళ్లి పోతా అంటుంది. దానికి శివ వెళ్ళిపో అంటాడు. మంచిగా తిని మంచిగా పడుకుని ఒక్కడివే ఉండు అని అక్కడ నుంచి ప్రియాంక వెళ్తుంది. ఆ తర్వాత శివ మళ్లీ ఆమెను దగ్గరకు తీసుకుని క్షమించమని బుజ్జగిస్తాడు. ఇద్దరు కలిసి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటారు. అంతేకాకుండా శివ ఆమె కోసం ఐస్ క్రీం చేసి తీసుకురావడంతో ఎమోషనల్ అయి ఏడ్చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో కొందరు బ్రేకప్ చెప్పుకుంటారా? ఏంటని కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరేమో పనికొచ్చే వీడియోలు చేయొచ్చుగా అంటూ మండిపడుతున్నారు.