Mohan Sharma – Lakshmi : నటి లక్ష్మి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరుని తెచ్చుకుంది లక్ష్మి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. తల్లిగా అత్తగా రకరకాల పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది. ప్రస్తుత మోహన్ శర్మ అనే నటుడు తన మాజీ భార్య అయినటువంటి లక్ష్మి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నన్ను మోసం చేసింది లక్ష్మి. పెళ్లి చేసుకుంటే కుక్కలా పడి ఉంటాను అని చెప్పింది, రూముకి రమ్మంది, గాంధర్వ వివాహం చేసుకున్నాము, తర్వాత నన్ను మోసం చేసింది వేరే వాళ్ళతో వెళ్లిపోయింది అని ఇలా రకరకాలుగా ఆమె మీద కామెంట్స్ చేశారు. ఆమెకి 17 ఏళ్ల వయసులో భాస్కర్ అనే వ్యక్తిని పెద్దలు చూడగా ఆమె పెళ్లి చేసుకుంది.
ఆ జంటకి ఐశ్వర్య పుట్టింది తర్వాత ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. కొన్ని రోజులకి మోహన్ శర్మతో ప్రేమలో పడింది లక్ష్మి ఆ కాపురం కూడా ఐదేళ్లకే కుప్పకూలింది. తర్వాత శివచంద్రన్ అనే ఇంకో దర్శకుడు తో పెళ్లి జరిగింది. వారు కూడా ఏం జరిగిందో ఏమో తెలియదు త్వరగానే విడిపోయారు చివరికి అనంత నాగ్ అనే ఒక నటుడుతో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆమె జీవితం అంతా కూడా కష్టాలే. ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆ కాపురం నిలబడలేదు. రెండవ పెళ్లి టైం లో లక్ష్మీ జీవితంలో ఏం జరిగిందో మోహన్ శర్మకి మొత్తం తెలుసు. అలానే ఒక నటి జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసు.
అయినా కూడా ఆమెకి మనోవేదనని మిగిల్చడమే కాకుండా ఇప్పుడు ఆమె గురించి మాట్లాడడం ఎందుకు..? ఆమె అలా చేసింది ఇలా చేసింది తప్పులు చేసింది అంటూ చెప్తున్నారు. అది కూడా మీడియా ముందు. ఇంత వయసు వచ్చిన ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారని దొరికిందే చాన్స్ అన్నట్లు మాట్లాడుతూ వున్నారని అంతా మండిపడుతున్నారు. లక్ష్మికి కుక్కలా పడాల్సిన అవసరం లేదు ఆమె ఆ రోజులు ఒక స్టార్ హీరోయిన్. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నటిగా నిర్మాతగా ఆమె మంచి పేరు తెచ్చునది. అయిన కూడా మోహన్ శర్మ అనే చిన్న నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు లక్ష్మి నిజంగా పెద్ద త్యాగం చేసింది. ప్రస్తుతం ఆమెకి సంబంధించి చిన్న చిన్న పాత్రలు చేస్తూ హుందాగా ఉంటోంది. తన జీవితంలోకి వచ్చినా మగాళ్ళ గురించి తప్పుగా మాట్లాడిందే లేదు.