Actress Divi : అమ్మానాన్న చూస్తారన్న భయంతో బాత్ రూంకెళ్లి షవర్ కింద అలా చేశా.. దివి సంచలన వ్యాఖ్య

- Advertisement -


Actress Divi : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది కలలు కంటుంటారు. సినిమాల్లోకి రావాలని స్టార్ హీరోయిన్‎గా మారాలని కోరుకుంటారు. అందుకోసం చాలామంది అమ్మాయిలు తెగ కష్టపడుతుంటారు. అయితే కొంతమంది మాత్రమే ఎంత కష్టమైనా.. ఎంత నష్టమైనా సరే భరించి తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు . ప్రస్తుతం ఆ జాబితాలోకే వస్తుంది దివి వైద్య. ఇలా చెప్తే ఆమె ఎవరన్న అనుమానం కలుగవచ్చు. అదే బిగ్ బాస్ దివి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రజెంట్ దివి నటించిన సినిమా లంబసింగి. ఈ సినిమా ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.

ఈ సినిమా కోసం దివి ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన సినిమాను ప్రమోట్ చేసుకోవాలనుకున్న దివి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో సన్నగా ఉంటే లావు అవ్వాలని .. లావు ఉంటే సన్నగా తయారవ్వాలని చాలా కండిషన్స్ పెట్టారట. అవకాశాల కోసం ప్రతిదీ చాలా ఓపికగా భరించిందట. తీరా వాళ్లు చెప్పిన విధంగా అన్ని చేసుకుని రెడీ అయి వెళ్తే రేపు కాల్ చేస్తాం.. ఎల్లుండి కాల్ చేస్తామంటూ హ్యాండ్ ఇచ్చేవారట.

రీసెంట్ గా కూడా రవితేజ తో నటించే అవకాశం వచ్చిందని.. ఫైవ్ డేస్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ, రాత్రికి రాత్రే ఫోన్ చేసి నిన్ను తీసుకోవడం లేదు అంటూ చెప్పారని చాలా ఆవేదన చెందుతూ చెప్పుకొచ్చింది. దీంతో మంచం పై పడుకుని దిండు ముఖంపై పెట్టుకుని గుక్కపెట్టి ఏడ్చాను అని.. ఎక్కడ మా అమ్మనాన్న చూస్తే బాధపడుతారో అని తెలిసి అర్ధరాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లి షవర్ కింద తలపెట్టి నోరు మూసుకొని గట్టిగా ఏడుస్తూ నా బాధను దిగమింగుకున్నాంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది. దివి ఆవేదనతో చెప్పిన మాటలకు నెటిజన్లు తెగ ఫీలవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here