Poonam Kaur : పూనమ్ కౌర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ కొన్ని సందర్భాల్లో పోస్ట్ చేసిన పోస్ట్‌లు చాలా త్వరగా వైరల్‌గా మారాయి. జల్సా సినిమాలో పూనమ్ కౌర్ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడం, ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకోవడం గమనార్హం. ఈ ప్రచారానికి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వైరల్‌గా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. జల్సా సినిమా నుంచి నన్ను తప్పించారని జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని ఆమె అన్నారు. నిజం కాని విషయాలను నమ్మించేందుకే అపోహలు ప్రచారం చేశారని పూనమ్ కౌర్ పేర్కొంది. నా జీవితంలో ఏ ఒక్క నటుడిని, దర్శకుడిని సినిమాలో అవకాశం అడగలేదని ఆమె వెల్లడించింది.

నేను నటించిన సినిమాలతో పోలిస్తే ఎక్కువ సినిమాలను రిజెక్ట్ చేశానంటూ వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని కోరింది.సినిమా ఆఫర్లు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటాను అని పూనమ్ వెల్లడించింది. ఇలా జల్సా సినిమా ఆఫర్ వార్తలకు చెక్ పెట్టింది. గీతాంజలి మృతిపై పూనమ్ కౌర్ కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓ పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పూనమ్ కౌర్ తన ఫ్యూచర్ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి. పూనమ్ కౌర్‌కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఎప్పుడో వచ్చిన జల్సా మువీలో పూనమ్ ఆఫర్ గురించి ఎందుకురా ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా సరే దొరకాలి గానీ, అవతలి వ్యక్తి చంపేసేంత ట్రోల్స్ మానుకోండి రా.. ఛీ ఛీ ఇలా తయారయ్యారేంట్రా మరీను వ్యూవ్స్ కోసం ఇంతగా దిగజారాలా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.