Faria Abdullah : ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వారవుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.. త్వరలోనే బుట్టబొమ్మ పూజా హెగ్డే, హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా రేపు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నాడట. తనతో పాటు త్వరలోనే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతిరత్నాలు చిట్టీగా పాపులారిటీ సంపాదించుకున్న ఫరీయా అబ్దుల్లా కూడా పెళ్లి చేసుకోబోతుందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలిసిన కుర్రాళ్లు వార్తను ట్రెండ్ చేస్తున్నారు. ఫరీయా అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఆమెకు చెందిన పలు యూట్యూబ్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. షార్ట్ ఫిలింస్ లో కూడా తను నటించి మెప్పించింది .
అయితే చిన్నప్పటినుంచి తన ఫ్రెండ్ ని ప్రేమిస్తూ వచ్చిన ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోబోతుందట. అయితే అతడు వెబ్ సిరీస్ లో హీరోగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ప్రకటించబోతుందట ఫరియా. ఇప్పటికే అమ్మడికి కాబోయే భర్త ఎలా ఉంటాడో అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫరియా అబ్ధులా బెల్లీ డాన్స్ ఇస్తే కళ్ళు ఆర్పకుండా చూసేస్తారు.. అలా నడుమును గిరగిరా తిప్పేస్తుంది. ప్రస్తుతం తాను అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో నటిస్తోంది.