Taapsee : తాప్సీ పన్ను ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన మరో అందాల ముద్దుగుమ్మ. ఝుమ్మంది నాదం సినిమాలో అమ్మడి అందాలకు తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించినా.. ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్సే దక్కింది. దీంతో బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ హవా కొనసాగిస్తుది. ఇది ఇలా ఉంటే తాప్సీ చాలా రిజర్వ్డ్ ..ఇండస్ట్రీ లో ఎవ్వరితోను పెద్దగా మాట్లాడదన్న మాటలే వినిపిస్తున్నాయి. బాలీవుడ్ కు వెళ్లింది కాని బడా బాబుల కంట్లో పడడానికి మాత్రం ట్రై చెయ్యడం లేదు. పర్సనల్ విషయాలు అస్సలు బయటపెట్టదు. కాని ఇండస్ట్రీ లో జరిగే విషయాలపై చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది.

జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు కూడా ఆమె హాజరు కాలేదు. బర్త్ డే పార్టీలు ఉంటే వాటికి దూరంగా ఉంటారు. బాలీవుడ్ పార్టీలు తనకు సరిపడవని చాలా సార్లు చెప్పేసింది ఈ బ్యూటీ. నేను పొద్దున్నే నిద్ర లేస్తాను కాబట్టి త్వరగా పడుకోవాలి. నేను సిగరెట్ తగను. కాబట్టి పార్టీల్లో ఏం చేయాలో నాకు తెలియడం లేదు’ అని అన్నారు. తాప్సీ పన్నూ.. గత పదేళ్లుగా మథాయుస్ బో తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెలలో వీరిద్దరి వివాహం జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీపిక, అలియా, ప్రియాంక, అనుష్క వంటి అగ్ర తారలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర నటీమణుల మాదిరిగా పార్టీలు, బహిరంగ ప్రదేశాల్లో ఎందుకు చాలా తక్కువ ప్రదర్శనలు ఇస్తారని అడిగారు. దీనిపై తాప్సీ స్పందిస్తూ.. కేవలం పార్టీలకు వెళ్లడం, లింకులు పెట్టుకోవడం పనికి వస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పింది. ఆమె కష్టపడి, తన ప్రతిభతో ముందుకు సాగాలని కోరుకుంటుంది. ఇప్పుడు అగ్ర హీరోయిన్లుగా చెలామణి అవుతున్న వారందరూ ఒకప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వాళ్లే. ఇప్పుడు వాళ్లు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. తాప్సీ పన్ను చివరిగా షారుఖ్ ఖాన్ చిత్రం డంకీలోకనిపించింది.