Pooja Hegdge : సినిమా అనేది రంగుల ప్రపంచం. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేదు. ఒక్కో సారి ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకోవచ్చు. మరోసారి ఇండస్ట్రీకే దూరం కావచ్చు. బహుశా హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో అదే జరిగిందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ టాలీవుడ్ బుట్ట బొమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని రొమాన్స్ పండించింది.

అంతవరకు బాగానే ఉన్నా.. వరుసగా మూడు ఫ్లాపులు పడేసరికి అమ్మడి సీన్ రివర్స్ అయిపోయింది.. బుట్టబొమ్మను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. అయితే రీసెంట్ గా పూజ హెగ్డే కి సంబంధించిన వార్త బాగా వైరల్ అవుతోంది. పూజ హెగ్డే తనకంటే వయసులో చిన్నవాడు.. అది కూడా తమ్ముడు వరస అయ్యే హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. అవకాశాలు లేకనే పూజా హెగ్డే ఇలాంటి నిర్ణయం తీసుకుందని.. తనకంటే వయసులో అంత చిన్న హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధపడిందంటున్నారు.

కేవలం డబ్బు కోసం మాత్రమే పూజ ఇలా చేయడానికి డిసైడ్ అయిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు దారుణాతి దారుణంగా ఆమెపై బూతు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత ఏడాది సల్మాన్ ఖాన్ తో “కిసీ కా బాయ్ కిస్ సి కా జాన్” అనే సినిమాలో నటించింది పూజ హెగ్దే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో నటించడం ద్వారా కూడా ఆమె మరింత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇకనైనా పూజ హెగ్డే మేల్కొని మంచి సినిమాలో నటిస్తే ఆమె లైఫ్ సెటిల్ అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు.