Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరి లైఫ్ లీడ్ చేస్తుంది. వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఓ నిర్మాణ సంస్థను ప్రాంరంభించి వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తెరకెక్కిస్తుంది.
నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. రోజుకో ఫొటోషూట్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తనపై ఎటువంటి ట్రోల్స్ వచ్చిన పట్టించుకోకుండా తను అనుకున్నది చేసుకుంటూ పోతుంది. అలాంటి సమయంలోనే నిహారిక తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిందా అంటే అవుననే చెప్పాలి. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది నిహారిక .
ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది. ” మీ లైఫ్ ఎలా సాగుతుంది ..? అనగా ఫెంటాస్టిక్ అంటూ మార్వలెస్ ఆన్సర్ ఇచ్చింది. మీరు కాఫీ లవరా..? అని అడగ్గా..” బిగ్ టైమ్ ” అంటూ సమాధానం చెప్పింది . ఓ వ్యక్తి మీ తమిళ్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ చెప్పొచ్చుగా..?” అని అడగడంతో మార్చి 17న మీకు గుడ్ న్యూస్ వస్తుంది. ఆ రోజే నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందంటూ ఆన్సర్ చేసింది.’’ సోషల్ మీడియాలో ప్రజెంట్ నిహారిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .
విడాకుల తర్వాత జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న నిహారిక కి ఆల్ ద బెస్ట్ అంటూ విషెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అందుకోవాలని చాలా తాపత్రయ పడిపోతుంది నిహారిక. కాగా నాగబాబు కూతురిగానే కాకుండా తనలో కూడా టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాలో నటించిన సరే ఆ స్థానాన్ని అందుకోలేకపోయింది నిహారిక. ప్రస్తుతం ఆ స్థానం కోసం మళ్లీ ట్రై చేస్తుంది.