Actress Jayalalitha : సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదగాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాలు రాక ఇబ్బంది పడేవాళ్లు కొందరైతే అవకాశాల కోసం అవస్థలు పడేవాళ్లు మరికొంత మంది. అవకాశం కావాలంటే అవసరం తీర్చాలనే చాలా మంది దర్శక నిర్మాతల వల్ల ఎంతో మంది అమ్మాయిలు సినిమా తమ కల అయినా ఆ కలను చంపేసుకుంటున్నారు. ఇంకొంత మంది ధైర్యం చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఇలాంటి కాంప్రమైజ్‌ల వల్ల ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇక ఎదుర్కోలేక అలాగని ఇంటికి తిరిగి వెళ్లలేక ఎంతో మంది నటీమణులు అవకాశాల కోసం కాంప్రమైజ్ అవుతున్నారు.
అలా సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల కాలం నుంచి ఓ వెలుగు వెలిగిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి జయలలిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్ పూలపాన్పు ఏం కాదని, కొన్నిసార్లు అవకాశాల కోసం తాను కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని తెలిపారు. అయితే తనకు ఇష్టం లేకుండా ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదని అన్నారు.
తాను సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయడంతో రియల్ లైఫ్‌లోనూ తన క్యారెక్టర్ అలాంటిదేననుకుని చాలా మంది తనను తప్పుడు మార్గంలో అప్రోచ్ అయ్యేవారని చెప్పుకొచ్చారు. అలా సినిమా షూటింగ్ కోసం ఔట్ డోర్ వెళ్లినప్పుడు హోటల్లో అర్ధరాత్రి సమయంలో తన గది వద్దకు వచ్చి తలుపులు కొట్టేవారని చెప్పారు. అలా తనను అప్రోచ్ అయిన వారిలో అప్పట్లో టాప్ స్థానంలో ఉన్న ఓ నటుడు కూడా ఉన్నారని చెప్పారు.
“ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అయితే ఆ డైరెక్టర్ నా వద్దకు వచ్చి తనతో ఓ రాత్రి గడపాలని అప్రోచ్ అయ్యాడు. నేను నో చెప్పే సరికి ఆ సినిమాలో నుంచి నా పాత్రను కట్ చేశారు. ఔట్‌డోర్ షూటింగ్ సమయంలో నా గది తలుపులు కొట్టేవారు. అలా కొన్నిసార్లు తప్పించుకున్నాను. కొన్నిసార్లు తప్పించుకోలేక కాంప్రమైజ్ అయ్యాను.
ఇంకొన్ని సార్లు తప్పనిసరిగా కాంప్రమైజ్ అయినట్లు చెప్పారు. నా ఫ్యామిలీ బాగుండాలి. నేనెలాగు ఇండస్ట్రీలోకి వచ్చాను. నా లైఫ్ ఎలాగూ ఇలా అయిపోయింది. కనీసం నా వాళ్లైనా బాగుండాలని అప్పుడు అలా చేశాను. అలా జరిగినందుకు నాకు కోపం ఏం లేదు. నాలాంటి పరిస్థితులు చాలా మంది హీరోయిన్లు ఎదుర్కొంటారు. కొందరు సర్దుకుపోతారు. ఇంకొందరు అవి తట్టుకోలేక వెళ్లిపోతారు.” అని జయలలిత చెప్పారు.
ఇక జయలలిత సినిమాల విషయానికి వస్తే ఆమె కితకితలు, రాధాగోపాలం, అల్లరి బుల్లోడు, ఇంద్రుడు చంద్రుడు, ఏప్రిల్ 1 విడుదల , రుద్రంకోట, గోపి గోపిక గోదావరి, మాయాబజార్ (2008), రాజకుమారుడు, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తోంది. దీపారాధన, గోరంత దీపం, ప్రేమ ఎంత మధురం, బంగారు గాజులు వంటి సీరియళ్లలో కీలక పాత్రలు పోషించింది. జయలలిత కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా నటించింది. ఈమెకు మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి.