Gopi Chand : హీరో గోపీచంద్ గురించి తెలియని వారుండరు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలతో మెప్పించాడు గోపీచంద్. మళ్లీ ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. పరాజయాలు ఎదరురైనా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన నుంచి సినిమా విడుదల అవుతుంది అంటే మినిమమ్ గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో ‘భీమా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మార్చి 8న మహిళ దినోత్సవం, శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో గోపీ చంద్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా గోపీ ముందుంటారు. ఈ విషయాలు కాసేపే పక్కన పెడితే గోపీచంద్ పెళ్లి గురించి నెట్టింట్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గోపీచంద్ పెళ్లి చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్ అని అందరూ భావిస్తున్నారు కానీ.. ఆయన చేసుకుంది లవ్ మ్యారేజీనట. ఈ హీరో ప్రేమ కథలో భారీ ట్విస్టులే ఉన్నాయి. హీరో శ్రీకాంత్ మేనకోడలిని గోపీచంద్ ఓ ఈవెంట్ లో చూశాడట. తనను చూడగానే తనకోసమే పుట్టినట్లు అనిపించిందట. చూడగానే తెగ నచ్చేసిందట. దీంతో ఆమెను పెళ్లంటూ చేసుకుంటూ ఆమెనే చేసుకోవాలని గోపీచంద్ నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ఎలా చెప్పాలో అర్థం కాక… సీనియర్ నటుడు చలపతి రావుకు తన మనసులోని మాటను చెప్పించాడట. విషయం శ్రీకాంత్ కు కూడా తెలియడంతో.. గోపిచంద్ కు బాగా సపోర్ట్ చేశాడట. పెళ్లి ఫిక్స్ అయ్యాక రేష్మ.. గోపిచంద్ కు టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చిందని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.