Anchor Jhansi గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు నటిగా, అటు యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. డిసెంబర్ నెలలో విడుదలైన సలార్ సినిమాతో ఝాన్సీ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. దానికి సీక్వెల్ గా రాబోతున్న సలార్2 సినిమాలో సైతం ఝాన్సీ పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు కెరీర్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంది.
కెరీర్ లో అంతబిజీగా ఉన్న ఝాన్సీ రోడ్డుపై చెత్త ఏరుకోవడం చూసిన జనాలు షాక్ అయ్యారు. మరో పనివాడితో కలిసి ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకులను తన కారులో నింపుకుంది. ఎండుగడ్డి, ఆకులను కాల్చి బూడిద చేయవద్దని అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయని అవి ప్రకృతి సమతౌల్య సూత్రం చెప్పుకొచ్చారు. తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఝాన్సీ ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఝాన్సీ చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నా ఝాన్సీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఝాన్సీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీని అభిమానించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంది. సోషల్ మీడియాలో సైతం ఝాన్సీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఝాన్సీకి గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గినా.. తనకు పేరొచ్చే మంచి పాత్రలను ఎంచుకుంటూ క్రేజ్ దక్కించుకుంటున్నారు. బుల్లితెరపై మాత్రం ఆమె ఎక్కువగా కనిపించడం లేదు. ఝాన్సీ 1994 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె పలు సీరియళ్లలో సైతం నటించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతుండటంతో ఝాన్సీ వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.