Rajamouli : రాజమౌళి తన సినిమా ప్రమోషన్స్ సమయంలో తప్పా మిగతా సమయాల్లో పెద్దగా మీడియా ముందుకు రారు. ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనరు. కానీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం అలా కాదు.. ఎప్పటికప్పుడు ఇంటర్య్యూలలో పాల్గొంటూ రాజమౌళి అప్‌కమింగ్ సినిమాల గురించి, ప్లాన్స్ గురించి, స్క్రిప్ట్ వరకు గురించి.. ఇలా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్‌తో మూవీ గురించి కూడా మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విజయేంద్ర ప్రసాద్‌కు చాలా అభిమానం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు బయటపెట్టారు. కానీ రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మాత్రం ఆయన సెట్ చేయలేకపోయారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వడం లేదని ఆయనకు ప్రశ్న ఎదురయ్యింది.
‘‘సమయం, సందర్భం రావాలి కదా. నిర్మాతలు ఎవరూ పవన్ కళ్యాణ్ డేట్స్‌తో రాలేదు. బాహుబలి వరకు వేరే హీరోల డేట్స్‌తోనే వచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్‌తో ఇంకొక స్టార్‌ను పెట్టి సినిమా తీద్దామన్నా.. ఆయనతో ఎవరూ చేయలేరు. ఆయన సూపర్ డూపర్ మెగాస్టార్. ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరు కలవడానికి. అందుకే ఆ ఆలోచన రాలేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్.