Sreemukhi : వామ్మో.. అక్కడ కూడానా.. ఇంట్లో ఉంటే అది కచ్చితంగా వేసుకోనంటున్న శ్రీముఖి

- Advertisement -


Sreemukhi : బుల్లితెర బ్యూటీ శ్రీముఖి గురించి వేరే చెప్పనక్కర్లేదు. టీవీ షోలు, ఎంటర్ టైనమెంట్ ప్రోగ్రామ్స్ కి హోస్టుగా చేస్తూనే అడపదడపా సినిమాల్లో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన అందచందాలు చూపిస్తూ ఫోటోలను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం శ్రీముఖి ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. అమ్మడు తెలుగులోని ఆల్మోస్ట్ అన్ని ప్రముఖ ఛానల్స్ లో పలు షోలతో బిజీగా ఉంది. శ్రీముఖి కచ్చితంగా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రీముఖి దానిపై పరోక్షంగా స్పందించింది.

Sreemukhi White Saree Photos

చూడటానికి చాలా బబ్లీగా ఉండే శ్రీముఖి పెళ్లి గురించి, ప్రేమలో పడిందనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ఈ అమ్మడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో వార్తలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాని రీసెంట్ గా పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంట్లో నుంచి ప్రెజర్ పెరిగిపోతుంది అని ..పెళ్లి చేసుకోమంటూ బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దాని గురించి ఆలోచించాల్సిన టైం వచ్చినట్లుందంటూ తెలిపింది. కాగా శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి మరింత దగ్గరయింది. శ్రీముఖి కి సంబంధించిన ప్రతి విషయం కూడా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది .

కాగా ఎప్పుడూ మేకప్ వేసుకుని హడావుడి చేసే శ్రీముఖి.. ఇంట్లో ఉంటే మేకప్ అసలు వేసుకోదట. కనీసం బేసిక్ మేకప్ కూడా లేకుండా నార్మల్ గా ఒక సాదాసీదా అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుందట. క్రీమ్స్ కూడా రాసుకోకుండా ఫేస్ వాష్ చేసుకుని రోజు గడపడానికి ఇష్టపడుతుందట. జనరల్ గా షూటింగ్స్ ఉంటే ఎక్కువగా మేకప్స్ వేసుకుంటూ ఉంటామని .. ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా మేకప్ లేకుండా ఉంటే ఆ కిక్కే వేరని శ్రీముఖి మేకప్ కష్టాలు తెలిసిన అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here