Mounika Reddy : హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల కుమార్తె మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. దగ్గరుండి మరీ మనోజ్, మౌనికల వివాహాన్ని జరిపించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దిరికి ఇది రెండో పెళ్లి కాగా.. మౌనికకు అప్పటికే ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లి రోజే ధైరవ్ బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు మనోజ్. ఇప్పుడు వీరి జీవితంలోకి మరో బుజ్జాయి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం మౌనిక గర్భంతో ఉంది.
మనోజ్, మౌనికల వివాహం జరిగి జరిగి ఆదివారానికి (మార్చి 3) సరిగ్గా ఏడాది. పెళ్లి రోజును పురస్కరించుకుని మనోజ్ తో తన అనుబంధంపై ఎమోషనలయ్యింది మౌనిక. తన ఫ్యామిలీకి సంబంధించిన అరుదైన ఫొటోలను పంచుకుంటూ భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హజ్బెండ్. నా లైఫ్ మొదలైనప్పటినుంచే నువ్వు నాకు తెలుసనిపిస్తోంది. మన ఇద్దరి మధ్య అన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు, ధైరవ్‌కు నీ మనసులో చోటిచ్చినందుకు థ్యాంక్స్. ఫ్రెండ్‌షిప్, పార్ట్‌నర్‌షిప్, క్రేజీషిప్.. ఇలా అన్నింటినీ అందించిన యూనివర్స్‌కు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేసింది నువ్వే.
సంతోషం, అనురాగాలు, ఆప్యాయతలు, బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చుకుందాం. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్. ఐ లవ్యూ. నా హృదయంలో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది’ అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది మౌనిక. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు మనోజ్- మౌనిక దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.