Regina Cassandra తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. రెజీనాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆతరువాత కూడా మంచి అవకాశాలే దక్కించుకుంది ఈ బ్యూటీ.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చేసిన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలతో వచ్చిన విజయాన్ని కూడా నిలుపుకోలేపోయింది రెజీనా. అయితే కొంతకాలంగా పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకొని రెజీనా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. కానీ, ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే రెజీనా ప్రస్తుతం పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్దమయ్యారట. ఓ బిజినెస్మేన్ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఇరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని, త్వరలో ఈ శుభవార్తను రెజీనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.