మెగాస్టార్ Chiranjeevi గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. వరుస సినిమాలతో దూసుకు వెళ్లిపోతున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించారు చిరంజీవి. ఇప్పుడు కూడా యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎంతోమందికి ఆదర్శంగా వున్నారు.
ఇటీవల పద్మభూషణ్ అవార్డుని చిరంజీవికి ప్రకటించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవు. ఈ అవార్డు వచ్చాక మొదటి సారి వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చారు చిరంజీవి. ఈ కార్యక్రమంలో చిరంజీవి చాలా సింపుల్ గా కనపడ్డారు. తర్వాత సినిమాని అలానే దర్శకుడుని ఉద్దేశిస్తూ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి ఇక్కడ మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి ఈ వేడుకకి ఒక వాచ్ పెట్టుకుని వచ్చారు. దానిపై అందరి దృష్టిపడింది. ఈ వాచ్ ఏ బ్రాండ్ కి చెందినది అనేది ప్రతి ఒక్కరు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కచ్చితంగా చిరంజీవి దగ్గర ఖరీదైన వాచ్లు ఉంటాయి ఈ విషయం మనకి తెలిసిందే.
అయితే చిరంజీవి ఈ సినిమా వేడుకల్లో పెట్టుకున్న వాచ్ ధర ఎంత, ఏ కంపెనీ కి చెందింది అనే విషయాలని చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకల్లో పెట్టుకున్న వాచ్ కంపెనీ పేరు వచ్చేసి ఏ లాంజ్ అండ్ స్నోహే. ఇది ఒక బ్రిటిష్ కంపెనీ ఈ వాచీ ధర చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అలానే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. దీని ధర సుమారు అర కోటి. 50,56747 అని తెలుస్తోంది.