Varun Tej : లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి క్యాన్సిల్.. కారణం ఏంటో చెప్పిన మెగా ప్రిన్స్

- Advertisement -


Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. హిట్, ఫ్లాప్ అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మార్చి 1న ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర సంగతులు చెబుతున్నాడు. అలా తన భార్య లావణ్య గురించి ప్రశ్నలు ఎదురవగా ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు.

‘మిస్టర్’ సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు వరుణ్-లావణ్య.. తమ బంధాన్ని చాలా సీక్రెట్‌గా మెంటైన్ చేస్తూ వచ్చారు. గతేడాది జూన్‌లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటారనే విషయం బయటకొచ్చినప్పుడు వీళ్ల ప్రేమ గురించి అందరికీ తెలిసింది. గతేడాది నవంబరులో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లైనప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరి ప్రేమ, పెళ్లికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే నెటిజన్స్ టక్కున పట్టేసుకొని నిమిషాల్లో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇక తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్2లో పాల్గొన్న వరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను సినిమాల విషయంలో చాలా స్ట్రిట్‌గా ఉంటాను. సినిమా షూటింగ్ ఐపోయే వరకు పర్సనల్ విషయాలపై ఫోకస్ చేయను, ముఖ్యంగా ఈ సినిమా కోసం లావణ్యతో నా పెళ్లి రెండు సార్లు వాయిదా వేసుకున్నానని పేర్కొన్నారు. ఇకపోతే వరుణ్ చేసిన వాటిలో లావణ్యకు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్న ఎదురవగా.. ఇప్పటివరకు ఆమెని ఈ ప్రశ్న అడగలేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here