పెద్ద స్టార్ హీరోతో సినిమాలో నటించేటపుడు మామూలు ఫైట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ లో నటిస్తే మిగిలిన రిస్క్ సీన్స్ లో డూప్ లను వాడడం మనకు తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో కేవలం డూప్ లతోనే మేనేజ్ చేసే హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం తమ పాత్ర కోసం ప్రాణాలను సైతం లెక్కించరు. అలాంటి హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఒకరు.
విక్రమ్ సినిమా ‘ఐ’ని అందరూ చూసే ఉంటారు. ఇందులో ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఈ సినిమాలో విక్రమ్ తన పాత్రల కోసం చేసిన రిస్క్ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు. అయితే ఈ సినిమాలో హీరో విక్రమ్ బాడీ బిల్డర్‌గా కనిపించనున్నాడు. అయితే ఈ సీన్ కోసం తన బాడీని చాలా స్ట్రాంగ్ గా ఫిట్ చేసుకోమని దర్శకుడు శంకర్ కోరితే విక్రమ్ ఒక్కడే. ఎలాంటి స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు వాడకుండా కేవలం మూడు నెలల్లోనే 20 కేజీల బరువు పెంచి శరీరాన్ని ఫిట్ గా చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘ఐ’ వైరస్ బారిన పడిన తర్వాత అతడి శరీరం చాలా బలహీనంగా మారుతుంది. కానీ చాలా బలహీనంగా కనిపించాలి కాబట్టి ఆ పాత్రకు గ్రాఫిక్స్ వాడవద్దని.. డైరెక్టర్ శంకర్ చెప్పినా వినకుండా కేవలం రెండు నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గాడు. కానీ ఒక్కసారిగా బరువు తగ్గడం వల్ల ప్రమాదమని.. మీ శరీరానికి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు అతడిని హెచ్చరించారు.
అయినా వినకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ పాత్ర కోసం రోజూ నిమ్మరసం తాగుతూ, ఉడకబెట్టిన గుడ్డు తింటూ రెండు నెలలు గడిపాడు. దీంతో అతని శరీరం బాగా బలహీనపడింది. ఎంతలా అంటే పెద్ద శబ్ధం విన్నా కింద పడేంత బలహీనంగా తయారయ్యాడు. పది నిమిషాలు అలాగే నిలబడితే ఒళ్ళంతా వణుకువచ్చేటంత. వాళ్ల కుటుంబసభ్యులు కూడా అతన్ని చూసి భయపడేవారు. విక్రమ్ లాంటి డెడికేషన్ మరే హీరోకి లేదని కచ్చితంగా చెప్పొచ్చు.