Deepthi Sunaina : సోషల్ మీడియా, బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్లకు దీప్తి సునయన గురించి పరిచయం అక్కర్లేదు. మొదట్లో సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ జనాల్లో మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని అమాంతం పెంచుకుంది. ఇక అలా అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌసులోకి అడుగుపెట్టే ఛాన్స్ కూడా కొట్టేసింది. వచ్చినా అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలుగు వారికి మరింద దగ్గరైంది.
బిగ్ బాస్ లో ఉన్నపుడు తనీష్ తో క్లోజ్ గా ఉండడంతో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అయితే ఆ తరువాతి సీజన్స్ లో షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తర్వాత వీరిద్దరి ప్రేమ బయటపడింది. అయితే ఏ బిగ్ బాస్ వలన వీరి ప్రేమ బయటపడిందో.. అదే బిగ్ బాస్ లో సిరితో షణ్ముఖ్ క్లోజ్ గా ఉండడంతో లవ్ కు బ్రేకప్ అయింది. అప్పటి నుంచి అటు దీప్తి-ఇటు షన్ను ఇద్దరూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు.
అయితే తాజాగా షన్ను బ్రదర్ కోసం వెళ్లిన పోలీసులకు మనోడు గంజాయి కొడుతూ దొరకడంతో అడ్డంగా బుక్కై అరెస్ట్ అయ్యాడు. తరువాత బెయిల్ కూడా వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా దీప్తి సునైనా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఆమె అభిమానులు అనేక ప్రశ్నలు ఆమెను అడిగారు. అందులో ఒక అభిమాని షన్ను ఉదంతాన్ని గుర్తు చేసేలా మీరు భలే ముందుగానే బరువు దించేసుకుని టెన్షన్ ఫ్రీ అయ్యారు కదా అని అడిగాడు. అయితే ఆమెకు ఎలా అర్ధం అయిందో తెలియదు.. కానీ ఆమె మాత్రం నాకున్న టెన్షన్స్ నాకున్నాయి, కానీ నేనెప్పుడూ దాన్ని బయటకు చూపించుకోను కదా అంటూ కామెంట్ చేసింది. ఇక అంతేకాదు ఫ్యాన్స్ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా ఆమె తెలివిగా, వెటకారంగా ఆన్సర్స్ ఇచ్చింది.