Sandeep : సందీప్ మావ ఏంటిది.. యానిమల్ పార్క్​ నుంచి బాబీ డియోల్ ను అందుకే లేపేశావా ?

- Advertisement -


Sandeep : 2023 సంవత్సరం రణబీర్ కపూర్‌ కెరీర్లోనే గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం. అతడు నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు విజయాల కరువును తీర్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.915 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన యానిమల్ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. రణబీర్ కపూర్ కాకుండా ఈ చిత్రంలో ఎక్కువ ప్రశంసలు పొందిన నటుడు బాబీ డియోల్. ఆయన చేసింది చిన్న పాత్ర అయినా గుర్తుండిపోయే విధంగా నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ బాబీ డియోల్ పాత్ర మొదటి భాగంలో చనిపోతుంది. తాజాగా ఆయన పాత్రకు మళ్లీ ప్రాణం పోసినట్లు తెలిసింది. అయితే ఈలోగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం మేకర్స్ ‘యానిమల్ పార్క్’ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. కొంత కాలంగా దీనిపై ఎలాంటి అప్‌డేట్ అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ‘యానిమల్ పార్క్’ కోసం విక్కీ కౌశల్‌ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. రణబీర్ కపూర్ డార్క్ థ్రిల్లర్ ‘యానిమల్ పార్క్’లో నెగిటివ్ రోల్ కోసం విక్కీ కౌశల్‌ని సంప్రదించారు. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. అయితే, వారిలో ఒకరు క్లోన్ చేయబడిన ఉగ్రవాది అజీజ్ హక్. అతను ఈ పార్టులో రణబీర్ కపూర్ లాగా అవుతాడు.

విక్కీ కౌశల్‌కి అజీజ్ హక్ పాత్రను ఆఫర్ చేయవచ్చని తెలిసింది. అయితే ఈ పాత్ర కోసం షాహిద్ కపూర్ పేరు కూడా చర్చల్లో ఉంది. ఈ సీక్వెల్‌కి విక్కీ కౌశల్ ఫైనల్ అయితే తొలిసారి ఆయనను నెగెటివ్‌ షేడ్‌ పాత్రలో చూడొచ్చు. అయితే దీనిపై నిర్మాతలు, నటీనటులు ఎలాంటి ప్రకటన చేయలేదు. విక్కీ కౌశల్ తన ప్రతి పాత్రలోనూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తను ‘ఛావా’ తో రాబోతున్నాడు. చిత్రంలో అతను ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, వీర యోధుడు ఛత్రపతి శంభాజీ రాజే పాత్రను పోషిస్తున్నాడు. దీని కోసం అతను భారీగా బాడీ బిల్డప్ చేస్తున్నాడు. శంభాజీ రాజేలా కనిపించేందుకు 116 కిలోల వరకు బరువు పెరగాలని ట్రై చేస్తున్నాడు. దీంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు సిద్ధం కావడానికి కత్తియుద్ధం, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు. మరాఠా, మొఘలుల మధ్య జరిగిన పోరాట కథ చిత్రంలో చూపబడుతుంది. దీని కోసం విక్కీ కౌశల్ దాదాపు 1500 నుండి 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో .. ప్రతి సన్నివేశంలో 150 నుండి 200 గుర్రాలతో చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here