Urvashi Rautela : గోల్డెన్ కేక్ కట్ చేసిన హీరోయిన్.. అంత అవసరమా అంటున్న నేటిజన్స్?

- Advertisement -

Urvashi Rautela : కొందరు సెలబ్రిటీలు ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా ఉండాలని భావిస్తుంటారు. అందులో భాగంగానే వేసుకునే డ్రెస్సుల నుంచి వేసుకునే చెప్పుల వరకు వెరైటీ కావాలి. మరి కొందరు రిచ్ గా కనపడాలని తహతహలాడుతూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రిచ్ నెస్ ను ప్రపంచానికి చూపించింది. పుట్టినరోజు సందర్భంగా గోల్డెన్ కేక్ కట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బ్యూటీ పుట్టినరోజు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఊర్వశి రౌతేలా.. ఈ పేరు చెప్పగానే కాస్త వెరైటీ గుర్తుకు వస్తుంది. డ్రెస్సింగ్ లో గానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ లో గానీ.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఎఫైర్ పై ఈ లేడీ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఫిబ్రవరి 25న తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ పుట్టినరోజు తనకి జీవితాంతం గుర్తుండిపోయేలా గోల్డెన్ కేక్ కట్ చేసి.. అందరినీ షాక్ కి గురి చేసింది. ఊర్వశి తన పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చేసేది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో ఏర్పాట్లు చేశారు. 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్‌తో ఏర్పాటు చేసిన కేక్‌ను ఈ క్యూటీ కట్ చేసింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో సింగర్ యోయో హనీ మెరిసాదు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఆ పిక్స్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీకు చాలా డబ్బు ఉంటే మాత్రం, కేక్‌కు బంగారు పొరను వేయడం అవసరమా? ఆ డబ్బు పేద పిల్లలకు ఉపయోగపడలేల ఏదైనా చేయొచ్చుగా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రత్యేకంగా ఉంటారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మరికొందరు కామెంటు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com